Sharukh Khan: మీరు ఆస్కార్ ను ఇంటికి తెస్తే దాన్ని తాకే అవకాశం ఇవ్వండి: రామ్ చరణ్ ను కోరిన షారుఖ్ ఖాన్

SRK wants Ram Charan give a chance to touch Oscar if RRR made it
  • ఆస్కార్ రిమైండర్ జాబితాలో ఆర్ఆర్ఆర్
  • రామ్ చరణ్ ను అభినందించిన షారుఖ్
  • మేం ఆస్కార్ గెలిస్తే అది భారతీయ సినిమాకు చెందుతుందన్న చరణ్
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ రిమైండర్ జాబితాలో చోటు దక్కించుకోవడం తెలిసిందే. తుది నామినేషన్లకు ముందు ఘట్టమే రిమైండర్ జాబితా. ఈ నేపథ్యంలో, ఆస్కార్ అవార్డుపై ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. 

దీనిపై బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ స్పందిస్తూ, రామ్ చరణ్ ను అభినందించారు. ఇంగ్లీషులో, ఇంగ్లీషు అక్షరాలతో తెలుగు పదాల ద్వారా తన భావాలను వ్యక్తీకరించారు. "మీ ఆర్ఆర్ఆర్ టీమ్ ఆస్కార్ ను భారత్ కు తీసుకువచ్చినప్పుడు ఒకసారి దాన్ని తాకే అవకాశం  ఇవ్వండి" అంటూ ట్వీట్ చేశారు. "నా మెగా పవర్ స్టార్ థాంక్యూ సో మచ్" అని పేర్కొన్నారు. 

అందుకు రామ్ చరణ్ వినమ్రంగా బదులిచ్చారు. "తప్పకుండా షారుఖ్ ఖాన్ సర్... ఒకవేళ మేం ఆస్కార్ గెలిస్తే అది భారతీయ సినిమాకు చెందుతుంది" అంటూ ట్వీట్ చేశారు.
Sharukh Khan
Ram Charan
Oscar
RRR
India
Tollywood
Bollywood

More Telugu News