Chiranjeevi: మరో మాస్ బీట్ కి ముహూర్తం ఖాయం చేసిన 'వాల్తేరు వీరయ్య'

Waltair Veerayya song release date cinfirmed
  • మాస్ యాక్షన్ మూవీగా 'వాల్తేరు వీరయ్య'
  • భారీ తారాగణంతో రూపొందిన సినిమా 
  • ఇంతవరకూ వదిలిన ప్రతి పాటా హిట్ 
  • రేపు మరో సాంగ్ రిలీజ్ కి సన్నాహాలు 
  • ఈ నెల 13వ తేదీన రిలీజ్ అవుతున్న సినిమా
చిరంజీవి కథానాయకుడిగా 'వాల్తేరు వీరయ్య' రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, బాబీ దర్శకత్వం వహించాడు. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, హనీ రోజ్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. చంద్రిక రవి ఐటమ్ సాంగ్ లో సందడి చేయనుంది. 

దేవిశ్రీ ప్రసాద్ నుంచి వచ్చిన ప్రతి పాటకు ఇంతవరకూ అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. వీటన్నిటికీ మించిన పాట మరొకటి ఉందనీ .. త్వరలోనే దానిని వదులుతామని మొన్న ఈవెంటులో చిరంజీవి అన్నారు. 'నీకేమో అందమెక్కువ .. నాకేమో తొందరెక్కువ' అంటూ రెండు లైన్స్ కూడా పాడారు. 

ఆ పాటను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 10:35 నిమిషాలకు హైదరాబాదులోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఆ పాటను లాంచ్ చేయనున్నారు. రవితేజ .. ప్రకాశ్ రాజ్ .. బాబీ సింహా ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ నెల 13వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో రిలీజ్ చేస్తారు. .
Chiranjeevi
Sruthi Haasan
Waltair Veerayya Movie

More Telugu News