Team India: తొలి వన్డేలో భారత్ కు శుభారంభం.. 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 63 రన్స్ చేసిన భారత్

  • టీమిండియా, శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్
  • గువాహటిలో నేడు తొలి వన్డే
  • టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ అప్పగించిన లంక
  • శుభ్ మాన్ గిల్ 25, రోహిత్ శర్మ 38 పరుగులతో బ్యాటింగ్  
Team India get good start in 1st ODI against Sri Lanka

టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు గువాహటిలో తొలి వన్డే జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దాంతో, తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. శుభ్ మాన్ గిల్ 25, కెప్టెన్ రోహిత్ శర్మ 38 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

ఈ మ్యాచ్ కోసం టీమిండియా బలమైన జట్టుతో బరిలో దిగింది. రోహిత్ శర్మ, కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, సిరాజ్, అయ్యర్ పునరాగమనం చేశారు. వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని జట్టు ఎంపికలో జాగ్రత్త పడినట్టు అర్థమవుతోంది. టాస్ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్ దిశగా జట్టు సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు.

More Telugu News