Team India: డబుల్ సెంచరీ హీరో ఇషాన్, సూర్యలను పక్కనబెట్టిన భారత్

Team india drops Ishan kishan and surya kumar yadav in 1si odi
  • శ్రీలంకతో తొలి వన్డేలో ఓపెనర్ గా గిల్, మిడిలార్డర్ లో శ్రేయస్ కు అవకాశం
  • టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక
  • రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్ పునరాగమనం
బంగ్లాదేశ్ తో భారత జట్టు ఆడిన గత వన్డే మ్యాచ్ లో డబుల్ సెంచరీతో క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించిన యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ కు షాక్ తగిలింది. అలాంటి అద్భుత ఇన్నింగ్స్ ఆడిన తర్వాతి మ్యాచ్ లోనే ఇషాన్ కిషన్ కు భారత వన్డే జట్టులో చోటు కరవైంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా శ్రీలంకతో గువాహటిలో తొలి వన్డే లో పాల్గొనే భారత తుది జట్టు నుంచి ఇషాన్ ను తప్పించారు. శ్రీలంకతో మూడో టీ20లో మెరుపు సెంచరీ చేసి భీకర ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ను సైతం బెంచ్ పై కూర్చోబెట్టారు. 

ఓపెనర్ గా శుభ్ మన్ గిల్ ను కొనసాగించేందుకు ఇషాన్ కిషన్ ను, మిడిలార్డర్ లో శ్రేయస్ అయ్యర్ ను ఆడించేందుకు సూర్యకుమార్ ను పక్కనబెడుతూ భారత టీం మేనేజ్ మెంట్ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన శ్రీలంక కెప్టెన్ దసున్ షనక బౌలింగ్ ఎంచుకొని భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. టీ20 సిరీస్ కు విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ ఈ సిరీస్ తో తిరిగి బరిలోకి దిగుతున్నారు. టీ20 సిరీస్ లో ఆడిన హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, చహల్, ఉమ్రాన్ మాలిక్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.
Team India
odi
srilanka
ishan kishan
suryakumar yadav
Rohit Sharma
Virat Kohli

More Telugu News