Ashok Khemka: 56వ సారి బదిలీ అయిన ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా

  • హర్యానాలో అదనపు ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న అశోక్ ఖేమ్కా
  • తాజాగా ఆర్కైవ్స్ శాఖకు బదిలీ
  • 30 ఏళ్ల కెరీర్లో 56వ సారి బదిలీ
IAS officer Ashok Khemka transferred 56th time

హర్యానా రాష్ట్ర సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా మరోసారి వార్తల్లో నిలిచారు. 30 ఏళ్ల తన కెరీర్లో ఆయన 56వ సారి బదిలీ అయ్యారు. ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనను అదే హోదాలో ప్రభుత్వ ప్రాచీన పత్ర భాండాగార (ఆర్కైవ్స్) శాఖకు బదిలీ చేశారు. చీఫ్ సెక్రటరీకి ఆయన రాసిన లేఖ బదిలీకి కారణం అని చెపుతున్నారు. ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న శాఖను ఉన్నత విద్యా శాఖలో విలీనం చేయడంతో తనకు పని లేకుండా పోయిందని లేఖలో ఖేమ్కా పేర్కొన్నారు. తన స్థాయి అధికారికి వారానికి కనీసం 40 గంటల పనైనా ఉండాలని చెప్పారు. ఈ నేపథ్యంలో, ఆయన కోరిక మేరకు ఆర్కైవ్స్ శాఖకు సీఎస్ బదిలీ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆర్కైవ్స్ శాఖలో ఖేమ్కా పని చేయడం ఇది నాలుగోసారి.

More Telugu News