రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలపై కాపు సంఘాల ఫైర్

  • బాబు-పవన్ కల్యాణ్ భేటీపై రాంగోపాల్ వర్మ ట్వీట్
  • వర్మ ట్వీట్ వెనక వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపించిన కాపు సంఘాల నేతలు
  • కాపు మంత్రులు తమ జాతిని సీఎంకు తాకట్టుపెట్టారని మండిపాటు
Kapu JAC Slams RGV  Tweet on Babu Pawan Meet

‘రిప్ కాపులు.. కంగ్రాట్స్ కమ్మోళ్లు’ అంటూ ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై కాపు సంఘాలు తీవ్రస్థాయిలో స్పందించాయి. రాంగోపాల్ వర్మ ట్వీట్ వెనక వైసీపీ నాయకుల హస్తం ఉందని ఆరోపించాయి. వర్మ ట్వీట్ తర్వాత విజయవాడలోని ప్రెస్ క్లబ్‌లో కాపు సంఘాల జేఏసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. 

ఈ సందర్భంగా కాపు ఐక్యనాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహన్‌రావు మాట్లాడుతూ.. చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీపై వర్మ ట్వీట్ వెనక వైసీపీ నేతల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కాపు మంత్రులు తమ జాతిని ముఖ్యమంత్రికి తాకట్టుపెట్టారని మండిపడ్డారు. కాపులపై కుట్రలో భాగంగానే ఆర్జీవీ ఈ ట్వీట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాపు నేతలు పాల్గొన్నారు.

కాగా, నిన్న రాంగోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. డబ్బు కోసం సొంత కాపులను అమ్మేస్తాడని తాను ఊహించలేదన్నారు. ‘రిప్ కాపులు.. కంగ్రాచ్యులేషన్స్ కమ్మోళ్లు’ అని ట్వీట్ చేశారు.

More Telugu News