Dronavalli Harika: నీ పట్ల గర్విస్తున్నాం బావా... దర్శకుడు బాబీకి విషెస్ తెలిపిన ప్రముఖ చెస్ క్రీడాకారిణి

Chess player Dronavalli Harika wishes all the best director Bobby for Waltair Veerayya
  • చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య
  • నిన్న విశాఖలో ప్రీ రిలీజ్ ఈవెంట్.. జనవరి 13న రిలీజ్
  • నీ హార్డ్ వర్క్ మాకు తెలుసు బావా అంటూ ద్రోణవల్లి హారిక ట్వీట్
తెలుగమ్మాయి, అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక టాలీవుడ్ దర్శకుడు బాబీకి విషెస్ తెలిపింది. హారిక దర్శకుడు బాబీకి మరదలు అవుతుంది. హారిక సోదరి అనూషను బాబీ వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో, బాబీ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యతో తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఈ సినిమా జనవరి 13న థియేటర్లలోకి వస్తోంది. నిన్ననే విశాఖలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుకుంది. 

ఈ నేపథ్యంలో ద్రోణవల్లి హారిక స్పందించింది. "నీ పట్ల మేం చాలా చాలా గర్విస్తున్నాం బావా. నువ్వెంత శ్రమించావో మాకు తెలుసు... నీ తదుపరి విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఆగలేకపోతున్నాం" అంటూ ట్వీట్ చేసింది. అంతేకాదు, వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాము టీవీలో చూస్తున్నప్పటి ఫొటోలను కూడా హారిక పంచుకుంది.
Dronavalli Harika
Bobby
Waltair Veerayya
Chiranjeevi

More Telugu News