'బుట్టబొమ్మ' నుంచి ఫస్టు సింగిల్ రిలీజ్!

  • బాలనటిగా అనిఖ పాప్యులర్ 
  • టీనేజ్ హీరోయిన్ గా వరుస సినిమాలు 
  • విడుదలకి రెడీ అవుతున్న 'బుట్టబొమ్మ'
  • టాలీవుడ్లో బిజీ అయ్యే అవకాశాలు    
Buttabomma Frist Look Released

అనిఖ సురేంద్రన్ .. బాలనటిగానే ఎంతోమంది ప్రశంసలను అందుకుంది. టీనేజ్ హీరోయిన్ గా ఇప్పుడు తన డేట్స్ దొరకడమే కష్టం. ఆమె ప్రధానమైన పాత్రగా 'బుట్టబొమ్మ' సినిమా రూపొందింది. సితార నాగవంశీ - సాయి సౌజన్య కలిసి నిర్మించిన ఈ సినిమాకి శౌరి చంద్రశేఖర్ దర్శకత్వం వహించాడు.

గ్రామీణ నేపథ్యంలో రూపొందిన స్వచ్ఛమైన ప్రేమకథ ఇది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేశారు. "పేరులేని ఊరిలోకి కొత్త గాలొచ్చిందా? ఊసుపోక ఊసులెన్నో తీసుకొస్తూ ఉందా? అంటూ ఈ పాట నేపథ్య గీతంగా వస్తోంది. పల్లె వాతావరణానికి .. అక్కడి జీవనానికి ఈ పాట అద్దం పడుతోంది. 

స్వీకర్ అగస్తి సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటను మోహన భోగరాజు ఆలపించారు. హుషారైన ఈ పాట బీట్ బాగుంది. మోహన భోగరాజు స్వరం ఈ పాటకి ప్రాణం పోసింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత అనిఖ ఇక్కడ బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News