Gutka Packets: గుట్కా ప్యాకెట్లలో రూ.32 లక్షల విలువైన అమెరికా డాలర్ల పట్టివేత

  • కోల్ కతా ఎయిర్ పోర్టులో ఘటన
  • బ్యాంకాక్ వెళుతున్న ప్రయాణికుడు
  • తనిఖీ చేసిన ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులు
  • భారీ సంఖ్యలో గుట్కా ప్యాకెట్ల స్వాధీనం
  • గుట్కా ప్యాకెట్లలో విదేశీ కరెన్సీ అక్రమ రవాణా
American dollars worth 32 lakhs found un Gutka packets

గుట్కా ప్యాకెట్లలో విదేశీ కరెన్సీ అక్రమ రవాణా చేస్తున్న ఘటన పశ్చిమ బెంగాల్ లో వెల్లడైంది. కోల్ కతా నుంచి థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ వెళుతున్న ప్రయాణికుడి నుంచి ఈ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. 

కోల్ కతా కస్టమ్స్ విభాగానికి చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) అధికారులు బ్యాంకాక్ వెళుతున్న ఆ ప్రయాణికుడిని అడ్డుకున్నారు. అతడి లగేజీని తనిఖీ చేసిన అధికారులు పెద్ద ఎత్తున గుట్కా ప్యాకెట్లను కనుగొన్నారు. వాటిని తెరిచి చూడగా, అందులో గుట్కాతో పాటు అమెరికా డాలర్లు దర్శనమిచ్చాయి. 

డాలర్లను జాగ్రత్తగా ఓ రేపర్ లో చుట్టి ప్యాక్ చేసినట్టు తెలుసుకున్నారు. భారత కరెన్సీలో వాటి విలువ రూ.32 లక్షలు ఉంటుంది. దాంతో ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

More Telugu News