Asaduddin Owaisi: ఈ పని చేస్తేనే మోదీని ఓడించగలం: అసదుద్దీన్ ఒవైసీ

Owaisi comments on how to defeat modi
  • అన్ని నియోజకవర్గాల్లో విపక్షాలు గట్టి పోటీని ఇవ్వాలన్న అసద్ 
  • విపక్షాల నుంచి సింగిల్ ఫేస్ ను పీఎం అభ్యర్థిగా నిలబెట్టినా మోదీకే లాభమని వివరణ  
  • రాహుల్ ని నిలబెట్టినా మోదీకే ఉపయోగకరమని వ్యాఖ్య 

వచ్చే ఎన్నికల్లో విపక్ష పార్టీలు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ప్రధాని అభ్యర్థిగా పెడితే అది బీజేపీకి, ప్రధాని మోదీకి అనుకూలంగా మారుతుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బీజేపీని ఓడించాలంటే అన్ని నియోజకవర్గాల్లో విపక్షాలు ఎంతో పట్టుదలతో పని చేయాలని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి గట్టి పోటీని ఇవ్వాలని... విపక్షాల నుంచి సింగిల్ ఫేస్ ను మాత్రమే ప్రధాని అభ్యర్థిగా నిలబడితే ప్రయోజనం ఉండదని అన్నారు. 

మోదీకి పోటీగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నిలబెట్టినా మోదీకే లబ్ధి చేకూరుతుందని చెప్పారు. మోదీకి సరైన విపక్ష అభ్యర్థి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అని కచ్చితంగా చెప్పలేమని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పార్లమెంటులో మమతా బెనర్జీ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారని... అయితే అదే సమయంలో మోదీని ప్రశంసించారని చెప్పారు.

  • Loading...

More Telugu News