Budda Venkanna: మహేశ్ బాబు సోదరుడి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన బుద్ధా వెంకన్న

Budda Venkanna attends first obituary of Ghattamaneni Ramesh Babu
  • గతేడాది జనవరి 8న కన్నుమూసిన రమేశ్ బాబు
  • హైదరాబాదులో ప్రథమ వర్థంతి కార్యక్రమం నిర్వహణ
  • రమేశ్ బాబు చిత్ర పటానికి నివాళులు అర్పించిన బుద్ధా వెంకన్న
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్ బాబు గతేడాది కన్నుమూసిన సంగతి తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో, ఆయన ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు హైదరాబాదులో నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న కూడా హాజరయ్యారు. రమేశ్ బాబు చిత్రపటానికి నివాళులు అర్పించారు. మహేశ్ బాబు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దీనిపై బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో వెల్లడించారు. ఫొటోలు కూడా పంచుకున్నారు. 

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా రమేశ్ బాబు సినీ రంగంలో ప్రవేశించి పలు చిత్రాల్లో హీరోగా నటించారు. ఆయన చాలా కాలం కిందటే నటనకు దూరమయ్యారు. 1997లో వచ్చిన ఎన్ కౌంటర్ చిత్రం ఆయనకు నటుడిగా చివరిది. ఆ తర్వాత నిర్మాతగా మారి తమ్ముడు మహేశ్ బాబు చిత్రాల నిర్మాణంలో పాలుపంచుకున్నారు. రమేశ్ బాబుకు భార్య మృదుల, కుమారుడు జయకృష్ణ, కుమార్తె భారతి ఉన్నారు.
Budda Venkanna
Ghattamaneni Ramesh Babu
Mahesh Babu
Superstar Krishna

More Telugu News