Badrachalam: భద్రాచలంలో బూజు పట్టిన లడ్డూల పంపిణీ

  • ఆలయ సిబ్బంది తీరుపై మండిపడుతున్న భక్తులు  
  • ముక్కోటి ఏకాదశి సందర్భంగా భారీగా లడ్డూల తయారీ
  • మిగిలిపోయిన లడ్డూలను భద్రపరచడంలో సిబ్బంది నిర్లక్ష్యం
Fungus Found In Bhadrachalam Sita Ramachandraswamy Temple prasadam

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన భద్రాచలం రామాలయంలో భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఎంతో పవిత్రంగా భావించే శ్రీరాముడి ప్రసాదంలో బూజుపట్టిన లడ్డూలు రావడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రసాదం కౌంటర్ పై ‘ఇచ్చట బూజు పట్టిన లడ్డూలు అమ్మబడును’ అని రాసిన పేపర్ ను అతికించి నిరసన తెలిపారు. లడ్డూల నాణ్యతను అధికారులు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు.

ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో రాములవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు పంచేందుకు 2 లక్షల లడ్డూలను ఆలయ అధికారులు తయారుచేయించారు. పండుగ పూర్తయిన తర్వాత మిగిలిన ప్రసాదాన్ని నిల్వ చేసే విషయంలో ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. దీంతో పెద్ద సంఖ్యలో లడ్డూలు బూజు పట్టాయి. అయినప్పటికీ వాటిని అలాగే కౌంటర్ లో పెట్టి సిబ్బంది అమ్ముతున్నారు. దీనిపై భక్తులు అభ్యంతరం వ్యక్తంచేస్తూ సిబ్బందితో గొడవపడ్డారు.

More Telugu News