Russian Soldier: బాణాలతోనూ ఉక్రెయిన్ సైనికులను హతమారుస్తున్న రష్యన్ సైనికులు.. వీడియో

Russian Soldier Using Bow And Arrow During Ukraine War Gets Mocked Online
  • బాణం వేసి, తుపాకీతో కాల్పులు
  • మరిన్ని యుద్ధ విద్యలు ప్రదర్శిస్తున్న రష్యా
  • ఏడాదిగా ముగింపు లేకుండా కొనసాగుతున్న యుద్ధం
  • ఇప్పటికే ఇరువైపులా భారీ ప్రాణ నష్టం
రష్యా సైనికులు ఉక్రెయిన్ పై యుద్ధంలో ఎన్నో విద్యలు ప్రదర్శిస్తున్నారు. చివరికి విల్లంబులతో వారు ఉక్రెయిన్ సైనికులను వేటాడుతున్నారు. ఇందుకు సంబంధించి ఫొటోలు, వీడియో ట్విట్టర్ లోకి చేరాయి. ఉక్రెయిన్ హోం శాఖ మంత్రి సలహాదారు ఆంటోన్ గెరషెంకో షేర్ చేశారు. గతేడాది ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వాస్తవ బలాబలాల ఆధారంగా అయితే నెల రోజుల్లోనే రష్యా సైనిక బలం ముందు ఉక్రెయిన్ తలవొగ్గాల్సి వచ్చేది. కానీ, అమెరికా సహా పాశ్చాత్య దేశాలు అత్యాధునిక ఆయుధాలను అందిస్తూ ఉక్రెయిన్ కు అండగా నిలుస్తున్నాయి. దీంతో రష్యాను ఉక్రెయిన్ బలంగా ఎదుర్కొంటోంది. దీంతో ఈ యుద్ధం ముగింపు అన్నది లేకుండా ఏడాదిగా నడుస్తోంది.

ఇప్పటికే ఇరువైపులా భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగినట్టు అంచనా. ఈ క్రమంలో రష్యా సైనికులు విల్లులను సైతం వాడడం చర్చనీయాంశంగా మారింది. రష్యా సైనికుడు మెడకు ఓ అత్యాధునిక గన్ ను తగిలించుకుని, చేతులతో విల్లు, బాణాన్ని ఎక్కుపెట్టి ఉక్రెయిన్ సైనికుల కోసం గాలిస్తున్న దృశ్యాన్ని వీడియోలో చూడొచ్చు. ఉక్రెయిన్ సైనికుడు కనిపించిన వెంటనే బాణం విసిరి, వెంటనే తుపాకీ తీసుకుని కాల్పులు జరిపేందుకు అతడు సమాయత్తం అవుతుండడం కనిపిస్తోంది.
Russian Soldier
Using Bow
Arrow
Ukraine War

More Telugu News