jallikattu: జల్లికట్టు పోటీల్లో తొలిరోజే 20 మందికి గాయాలు

20 people injured in jallikattu competition in Thachankurichi
  • గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమం
  • తమిళనాడులోని పుదుకోట్టైలో ప్రారంభమైన పోటీలు
  • మంత్రులు రఘుపతి, మెయ్యనాథన్ హాజరు
జల్లికట్టు పోటీలు ప్రారంభంలోనే రక్తం చిందింది. మొదటి రోజే 20 మందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని నిర్వాహకులు చెప్పారు. అయితే, గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తమిళనాడు పుదుకోట్టైలోని తచంకురిచిలో ఆదివారం ఉదయం జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. భారీ భద్రత మధ్య తమిళనాడు మంత్రులు రఘుపతి, మెయ్యనాథన్, జిల్లా కలెక్టర్ కవిత ఈ పోటీలను ప్రారంభించారు. ఈ ఆటలో గెలుపొందిన క్రీడాకారులకు బైక్‌లతో పాటు విలువైన బహుమతులు అందజేయనున్నారు.

జల్లికట్టు పేరుతో మూగజీవాలను హింసిస్తున్నారనే ఆరోపణలతో గతంలో ఈ ఆటపై ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఈ ఆటలో పాల్గొన్న వారిలో కొంతమంది చనిపోతుండగా.. చాలా మంది గాయపడుతున్నారు. దీంతో జల్లికట్టుపై నిషేధం విధించారు. అయితే, సుప్రీం కోర్టు దాక వెళ్లి జల్లికట్టు పోటీల నిర్వహణకు అనుమతులు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో స్టాలిన్ ప్రభుత్వం షరతులతో జల్లికట్టు నిర్వహణకు అనుమతిచ్చింది.
jallikattu
Tamilnadu
20 people inijured
competition
first day jallikattu

More Telugu News