అభిమానులకు విజయ దేవరకొండ నుంచి ఊహించని గిఫ్ట్
- మనాలీ ట్రిప్ కు 100 మంది అభిమానులు
- ఐదు రోజుల పర్యటనలో పర్వతాలు, ఆలయాల సందర్శన
- అభిమానులతో జాయిన్ కానున్న లైగర్ హీరో
‘‘ఆహారం, ప్రయాణం, వసతి అంతా నేనే చూసుకుంటాను. మనాలీకి ఐదు రోజుల పర్యటన ఉంటుంది. మంచు దుప్పటేసిన పర్వతాలకు, ఆలయాలకు, మఠాలకు వెళతారు. ఎన్నో యాక్టివిటీలకు ప్లాన్ చేశాను. 18 ఏళ్లు నిండి, నన్ను అనుసరించే వారు గూగుల్ డాక్యుమెంట్ ను ఫిల్ చేయండి. మీలో 100 మందిని ఎంపిక చేసి మనాలీకి పంపిస్తాను. మీతో నేను కూడా జాయిన్ అవుతాను’’అని విజయ్ దేవరకొండ అభిమానులకు ఊహించని కానుకను ప్రకటించాడు. ప్రస్తుతం ఈ నటుడు ఖుషీ సినిమాతో బిజీగా ఉండడం తెలిసిందే. (విజయ్ దేవరకొండ మాట్లాడిన వీడియో కోసం క్లిక్ చేయండి)