delhi firing: తనపై అత్యాచారం చేసిన నిందితుడి తల్లిపై బాధితురాలు కాల్పులు

16 Year Old Delhi Girl Shoots At Mother Of Teen Who Raped Her
  • ఢిల్లీలోని భాజన్ పురలో శనివారం సాయంత్రం ఘటన
  • ఆ మహిళ కొడుకుపై కక్షతోనేనని పోలీసులకు వెల్లడి
  • మహిళను ఆసుపత్రిలో చేర్పించి, నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఢిల్లీలోని భాజన్ పురలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తనపై అత్యాచారం చేసిన బాలుడిపై కోపాన్ని ఆమె తల్లిపై చూపించిందో అమ్మాయి. తుపాకీతో ఆ బాలుడి తల్లిపైన కాల్పులు జరిపింది. శనివారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితురాలితో పాటు బాలుడు కూడా మైనర్ కావడంతో పోలీసులు వారి వ్యక్తిగత వివరాలు వెల్లడించలేదు.

భాజన్ పురలో ఉంటున్న ఓ బాలిక కిందటేడాది తనపై అఘాయిత్యం జరిగిందంటూ పోలీసులను ఆశ్రయించింది. తన ఏరియాలో ఉండే బాలుడు ఒకరు తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. బాధితురాలితో పాటు నిందితుడు కూడా మైనర్ కావడంతో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణ జరిపి, అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉందని పోలీసులు చెప్పారు. తాజాగా, ఈ కేసులో నిందితుడైన బాలుడి తల్లిపై బాలిక కాల్పులు జరిపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మహిళను పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు.
delhi firing
rape victim
rapist mother
women wounded
delhi
crime

More Telugu News