Mekapati Chndrasekhar Reddy: డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు: శివచరణ్‌రెడ్డి బహిరంగ లేఖపై మేకపాటి

They Are Blackmailing Me Says YCP MLA Mekapati Chandrasekhar Reddy
  • వివాదంలో మేకపాటి చంద్రశేఖరరెడ్డి
  • తనను కుమారుడిగా అంగీకరించాలంటూ మేకపాటి శివచరణ్‌రెడ్డి బహిరంగ లేఖ
  • ఆమె ఎవరో తనకు తెలియదన్న ఎమ్మెల్యే
  • తనకు కొడుకులే లేరని స్పష్టీకరణ
  • రచనారెడ్డి, సాయిప్రేమితారెడ్డి తన రాజకీయ వారసులన్న చంద్రశేఖరరెడ్డి
తనను కుమారుడిగా ఒప్పుకోవాలంటూ మేకపాటి శివచరణ్‌రెడ్డి రాసిన బహిరంగ లేఖపై ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి స్పందించారు. సోషల్ మీడియాతోపాటు ప్రధాన మీడియాలో ఈ వార్త కలకలం రేపడంతో స్పందించిన ఎమ్మెల్యే ఫేస్‌బుక్‌ ద్వారా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. మీడియాలో తనపై వచ్చిన కథనాలు బోగస్ అని తేల్చి చెప్పారు. మొదటి భార్య తులసమ్మకు పుట్టిన రచనారెడ్డి, రెండోభార్య శాంతమ్మకు పుట్టిన సాయి ప్రేమితారెడ్డి మాత్రమే తన వారసులని స్పష్టం చేశారు. వీరు తప్ప తనకు కుమారులు ఎవరూ లేరని అన్నారు. 

తనపై ఆరోపణలు చేస్తున్న మహిళ భర్త పేరు వెంకటకొండారెడ్డి అని, కావాలంటే కంపసముద్రం వెళ్లి విచారించుకోవచ్చని అన్నారు. ఆమె భర్త ఎవరనేది ఆ గ్రామస్తులే చెబుతారని అన్నారు. తల్లీకొడుకులు ఇద్దరూ డబ్బుల కోసం తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక, గాలి మనుషుల్ని తీసుకొచ్చి డొంకతిరుగుడు మాటలు మాట్లాడడం సరికాదని హితవు పలికారు. తన వ్యక్తిగత జీవితం మీద బురద జల్లాలని అనుకుంటే భగవంతుడు మిమ్మల్ని క్షమించడని అన్నారు. తాను శాంతమ్మ, పాపతోనే ఉంటున్నట్టు చెప్పారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Mekapati Chndrasekhar Reddy
Sivacharan Reddy
YSRCP

More Telugu News