Team India: చివరి టీ20లో ఘనంగా గెలిచిన టీమిండియా... సిరీస్ కైవసం

Team India clinch T20 series against Sri Lanka
  • రాజ్ కోట్ లో టీమిండియా వర్సెస్ శ్రీలంక
  • 91 పరుగుల తేడాతో టీమిండియా విజయం
  • సిరీస్ 2-1తో హస్తగతం
  • ఈ నెల 10 నుంచి వన్డే సిరీస్
రాజ్ కోట్ లో శ్రీలంకతో జరిగిన చివరిదైన మూడో టీ20లో టీమిండియా 91 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంకను టీమిండియా బౌలర్లు 137 పరుగులకే కుప్పకూల్చారు. రెండో టీ20లో ఐదు నోబాల్స్ వేసి విలన్ గా మారిన అర్షదీప్ సింగ్ మూడో టీ20లో 3 వికెట్లు సాధించి అచ్చెరువొందించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 2, ఉమ్రాన్ మాలిక్ 2, చహల్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ పడగొట్టారు.

లంక బ్యాట్స్ మెన్ లో ఎవరూ చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేదు. కెప్టెన్ దసున షనక 23, ఓపెనర్ కుశాల్ మెండిస్ 23, ధనంజయ డిసిల్వా 22, చరిత్ అసలంక 19 పరుగులు చేశారు. 

అంతకుముందు, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు భారీ స్కోరు నమోదు చేసింది. మిస్టర్ 360 బ్యాట్స్ మన్ సూర్యకుమార్ యాదవ్ లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. సూర్య 51 బంతుల్లో 112 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 

ఈ మ్యాచ్ లో విజయంతో మూడు టీ20ల సిరీస్ ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. ఇక ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్ ఈ నెల 10న గువాహటిలో జరగనుంది.
Team India
Sri Lanka
T20 Series
3rd T20
Rajkot

More Telugu News