Avani Chaturvedi: భారత యుద్ధ విమాన మహిళా పైలెట్ అవని చతుర్వేది అరుదైన ఘనత

  • ఈ నెల 12 నుంచి ఇండో-జపాన్ వైమానిక విన్యాసాలు
  • జపాన్ లోని హయకురి ఎయిర్ బేస్ లో విన్యాసాలు
  • విదేశాల్లో భారత్ తరఫున పాల్గొంటున్న తొలి మహిళా పైలెట్ అవని
  • గతంలో మిగ్-21 బైసన్ యుద్ధ విమానం నడిపిన అవని
Squadron leader Avani Chaturvedi set to be the first woman pilot to take part in combat exercises abroad

భారత్, జపాన్ దేశాలు తొలిసారిగా సంయుక్తంగా వైమానిక విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఈ క్రమంలో భారత వాయుసేన స్క్వాడ్రన్ లీడర్ అవని చతుర్వేది అరుదైన ఘనత సొంతం చేసుకోనున్నారు. విదేశాల్లో భారత్ తరఫున యుద్ధ విన్యాసాల్లో పాల్గొంటున్న తొలి మహిళా పైలెట్ గా ఆమె నిలవనున్నారు. ఇండో-జపాన్ సంయుక్త విన్యాసాల్లో అవని సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానంతో పాల్గొననున్నారు. 

అవని 2018లో మిగ్-21 బైసన్ విమానం నడిపిన తొలి మహిళా పైలెట్ గా ఖ్యాతి గడించారు. ఆమె ఒక్కతే ఆ విమానాన్ని నడిపి అతివలు పురుషులకేమీ తీసిపోరని చాటారు. ఈ నేపథ్యంలో, జపాన్ లోని హయకురి వైమానిక స్థావరంలో నిర్వహించే వీర్ గార్డియన్ వైమానిక విన్యాసాల్లో అవని సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఉన్నారు. 

ఈ విన్యాసాలు జనవరి 12 నుంచి 26 వరకు జరగనున్నాయి. ఈ సంయుక్త విన్యాసాల కోసం భారత వాయుసేన నాలుగు సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానాలు, రెండు సీ-17 గ్లోబ్ మాస్టర్-III సైనిక రవాణా విమానాలు, ఐఎల్-78 గగనతల ఇంధన ట్యాంకర్ విమానం, 150 మంది సిబ్బందిని పంపిస్తోంది. అటు జపాన్ తన ఎఫ్-2, ఎఫ్-15 వంటి యుద్ధ విమానాలను రంగంలోకి దించుతోంది.

More Telugu News