Waltair Veerayya: విశాఖలో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదిక ఖరారు

Waltair Veerayya pre release event venue finalized
  • చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య
  • ఈ నెల 8న విశాఖలో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో జరుపుకోవాలన్న పోలీసులు
  • దరఖాస్తుకు అనుమతి ఇచ్చామని సీపీ శ్రీకాంత్ వెల్లడి
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 8న విశాఖలో నిర్వహించేందుకు చిత్రబృందం నిర్ణయించడం తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తొలుత ఆర్కే బీచ్ లో జరపాలనుకున్నా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దాంతో, వేదికను ఏయూ ఇంజినీరింగ్ కాలేజికి మార్చారు. 

ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ వెల్లడించారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఈవెంట్ నిర్వహించుకుంటామని అడిగారని, ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో వేడుక జరుపుకోవాలని చెప్పామని వివరించారు. చిత్రబృందం సమర్పించిన దరఖాస్తుకు ఆమోదం తెలిపామని పేర్కొన్నారు. 

బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ మూవీ వాల్తేరు వీరయ్య ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ కథానాయిక. ఈ సినిమా ట్రైలర్ కు విశేష స్పందన వస్తోంది. ఇందులో రవితేజ కీలకపాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు ప్రజాదరణ పొందాయి.
Waltair Veerayya
Pre Releade Event
Venue
Visakhapatnam
Police

More Telugu News