Botsa Satyanarayana: విమర్శలు చేసేముందు జీవోను క్షుణ్ణంగా చదవండి: బొత్స సత్యనారాయణ

Read GO no 1 before commenting says Botsa Satyanarayana
  • జీవో నెంబర్ వన్ పై విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలు
  • అసలు జీవోను చదివారా? అని బొత్స ప్రశ్న
  • రోడ్లపై బహిరంగసభలు పెట్టొద్దని మాత్రమే జీవోలో ఉందని వ్యాఖ్య
రహదారులపై సభలను నిషేధిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ వన్ పై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... విమర్శలు చేసే ముందు జీవోను క్షుణ్ణంగా చదవాలని సూచించారు. అసలు ఆ జీవోను ప్రతిపక్ష నేతలు చదివారా? అని ప్రశ్నించారు. 

రోడ్ షోలు, ర్యాలీలపై నిషేధం ఎక్కడుందో విమర్శకులు చెప్పాలని డిమాండ్ చేశారు. రోడ్లపై బహిరంగసభలు పెట్టొద్దని మాత్రమే జీవోలో ఉందని చెప్పారు. ఈ జీవో అన్ని పార్టీలకు వర్తిస్తుందని తెలిపారు. అవసరమైతే అనుమతి తీసుకుని బహిరంగసభలు పెట్టుకోవచ్చని చెప్పారు. వైఎస్సార్, జగన్ చేపట్టిన పాదయాత్రల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ప్రజల పట్ల అన్ని పార్టీలు బాధ్యతలను తీసుకోవాలని అన్నారు.
Botsa Satyanarayana
YSRCP
GO no 1

More Telugu News