Jallikattu: జల్లికట్టుకు పచ్చజెండా ఊపిన తమిళనాడు ప్రభుత్వం

  • తమిళనాడులో పురాతన సంప్రదాయ క్రీడగా జల్లికట్టు
  • గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ప్రజాదరణ
  • తమిళ సంస్కృతితో ముడిపడి ఉన్న క్రీడ
  • నూతన మార్గదర్శకాలతో అనుమతి ఇచ్చిన ప్రభుత్వం
Tamilnadu govt gives nod to Jallikattu

తమిళనాడు పురాతన సంప్రదాయ క్రీడ జల్లికట్టు. బలమైన ఎద్దులను బరిలోకి వదిలి లొంగదీసుకోవడం ఈ క్రీడలో చూడొచ్చు. అందుకే జల్లికట్టు తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన సంప్రదాయ క్రీడగా గుర్తింపు పొందింది. 

ప్రతి సంక్రాంతి సీజన్ లో తమిళనాట జల్లికట్టు పోటీలు నిర్వహిస్తారు. ఈ సంక్రాంతి సీజన్ ను పురస్కరించుకుని రాష్ట్రంలో రేపటి నుంచి జల్లికట్టు పోటీలు జరుపనున్నారు. ఈ మేరకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

వాస్తవానికి జనవరి 1 నుంచి ఈ పోటీలు నిర్వహిస్తుంటారు. అయితే దీనికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉండడంతో, ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుంది. జల్లికట్టు కోసం ప్రజల నుంచి డిమాండ్లు అధికమవుతుండడంతో, నూతన మార్గదర్శకాలతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఈసారి జల్లికట్టు నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ అనుమతిని తప్పనిసరి చేసింది. 

కాగా, తొలిసారిగా చెన్నై నగరంలో జల్లికట్టు నిర్వహించాలని ప్రముఖ నటుడు, మక్కళ్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమలహాసన్ భావిస్తున్నారు. అందుకు ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది.

More Telugu News