Ponniyin Selvan: ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ నామినేషన్లలో ఆర్ఆర్ఆర్, పొన్నియన్ సెల్వన్

  • ఆరు కేటగిరీల్లో పొన్నియన్ సెల్వన్ అర్హత
  • రెండు కేటగిరీల్లో పోటీ పడుతున్న ఆర్ఆర్ఆర్ 
  • మార్చి 12న అవార్డుల కార్యక్రమం
Ponniyin Selvan lands 6 nominations at Asian Film Awards RRR bags 2

ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ నామినేషన్లకు ఆర్ఆర్ఆర్, పొన్నియన్ సెల్వన్ సినిమాలు ఎంపికయ్యాయి. ఈ అవార్డుల కార్యక్రమం మార్చి 12న జరగనుంది. మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వన్ మొత్తం ఆరు కేటగిరీల్లో నామినేషన్లకు ఎంపికైంది. బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలోనూ పోటీ పడనుంది. రాజమౌళి తీసిన చిత్రం ఆర్ఆర్ఆర్ రెండు కేటగిరీల్లో చోటు సంపాదించింది. మన దేశం నుంచి కేవలం ఈ రెండు సినిమాలకే చోటు లభించింది. 

ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ అకాడమీ స్వయంగా ట్విట్టర్ లో దీనిపై ప్రకటన చేసింది. హాంగ్ కాంగ్ ప్యాలస్ మ్యూజియంలో మార్చి 12, ఆదివారం రాత్రి 7.30 గంటలకు 16వ ఏషియన్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమం ఉంటుందని తెలిపింది. పొన్నియన్ సెల్వన్ బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ ఎడిటింగ్ (శ్రీకర్ ప్రసాద్), బెస్ట్ సినిమాటోగ్రఫీ (రవి వర్మన్), బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ (ఏఆర్ రెహమాన్), బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ (ఏక లఖాని), బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ (తోట తరణి) విభాగాల్లో అర్హత లభించింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ (శ్రీనివాస మోహన్), బెస్ట్ సౌండ్ (అశ్విన్ రాజశేఖర్) విభాగాల్లో అర్హత పొందింది.

More Telugu News