Sankranti 2023: సంక్రాంతి సెలవుల్లో మార్పులు చేసిన ఏపీ ప్రభుత్వం

Change In Sankranti Holidays in Andhra Pradesh
  • స్కూళ్లకు ఈ నెల 12 నుంచి 18 వరకు సెలవులు
  • ఉపాధ్యాయ సంఘాల వినతితో మంత్రి బొత్స ఆదేశం
  • తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ అధికారులు

ఆంధ్రప్రదేశ్ లోని స్కూళ్లకు ఇప్పటికే ప్రకటించిన సంక్రాంతి సెలవులలో ప్రభుత్వం మార్పులు చేసింది. మార్పుల వివరాలతో రాష్ట్ర విద్యాశాఖ తాజాగా జీవో విడుదల చేసింది. ముందుగా ప్రకటించిన విధంగా సంక్రాంతి సెలవులు ఈ నెల 11 నుంచి 16 వరకు ఉండగా.. ఈ నెల 17న స్కూల్స్ పున: ప్రారంభం కావాలి. 

అయితే, 17న ముక్కనుమ కావడంతో ఆ రోజు కూడా సెలవు ఇవ్వాలంటూ ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి సెలవుల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. 

ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ అధికారులు తాజాగా జీవో విడుదల చేశారు. ఈ నెల 19 నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి.

  • Loading...

More Telugu News