Andhra Pradesh: కొత్త అప్పులకు ఏపీకి అనుమతినిచ్చిన కేంద్రం!

  • రూ. 21 వేల కోట్లు కావాలన్న ఏపీ ప్రభుత్వం
  • రూ. 4,557 కోట్లకు మాత్రమే అనుమతినిచ్చిన కేంద్రం
  • ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 49,860 కోట్ల బహిరంగ మార్కెట్ రుణాలకు అనుమతి
Union Govt Gave Green Signal To AP To Loans

మరిన్ని రుణాలు తెచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం గ్రీన్  సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఆశించిన మేర రుణాలకు అనుమతి లభించలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4,557 కోట్ల రుణాలకు మాత్రమే అనుమతినిచ్చింది. ఫలితంగా ఈ అప్పుతోనే మరో మూడు నెలలు సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. తాజా రుణాలతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీకి మొత్తం రూ. 49,860 కోట్ల బహిరంగ మార్కెట్ రుణాలకు కేంద్రం అనుమతులిచ్చింది. ఈ మొత్తం రుణాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 45,303 కోట్లను వినియోగించుకుంది. మిగిలిన రూ. 4,557 కోట్లకు కేంద్రం తాజాగా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలలకు రూ. 21 వేల కోట్లు కావాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇందుకోసం పలు వాదనలను కేంద్ర ఆర్థికశాఖ దృష్టికి తీసుకెళ్లింది. అయితే, కేంద్రం మాత్రం రూ. 4,557 కోట్ల  రుణాలకు మాత్రమే అనుమతినిచ్చింది.

More Telugu News