రూ.11 లక్షల బైక్‌ను పాల వాహనంగా మార్చేశాడు!

  • ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న వీడియో
  • హార్లీడేవిడ్‌సన్ బైక్‌కి పాలకేన్లు
  • కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
Man Uses Harley Davidson Bike for Milk Supply

ఇంటింటికి తిరిగి పాలుపోసేవారు సాధారణంగా స్కూటర్లు ఉపయోగిస్తుంటారు. అవి అయితే అనువుగా ఉంటాయి. ముందు రెండు కేన్లు, వెనక రెండు కేన్లు పెట్టుకుని పాలు పోయడానికి వెళ్తుంటారు. కొందరు బైకులను కూడా ఉపయోగిస్తుంటారు. ఇందులో వింత, విశేషం ఏమీ లేదు. కానీ, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒకటి అందరినీ నోళ్లు వెళ్లబెట్టేలా చేస్తోంది. 

ఓ యువకుడు ఏకంగా హార్లీ డేవిడ్‌సన్ బైకును పాలు పోసేందుకు ఉపయోగిస్తున్నాడు. వెనక రెండు పాలకేన్లు కట్టుకుని దూసుకుపోతున్న వీడియోను అమిత్ బడానా అనే ఇన్‌స్టా యూజర్ షేర్ చేశాడు. ఇందులో వింతేముందని అనుకోకండి.. ఆ బైక్ ఖరీదు రూ. 11 లక్షలకు పైమాటే. ఇది ఎక్కడ జరిగిందన్న విషయం కచ్చితంగా తెలియరాలేదు కానీ.. బైక్ రిజిస్ట్రేషన్ నంబరు బట్టి గుజరాత్‌కు చెందినదిగా తెలుస్తోంది. ఈ వీడియోకు నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

More Telugu News