Pawan Kalyan: హైదరాబాదులో పవన్ కల్యాణ్ ఇంటి ఎదుట హంగామా సృష్టించిన మహిళ

Woman creates ruckus at Pawan Kalyan residence in Hyderabad
  • పవన్ ను కలవాలంటూ సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదం
  • తన దుస్తులు తీసేస్తూ వారిపై రాళ్లతో దాడి
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికుడు
  • ఆమెను పీఎస్ కు తరలించిన పోలీసులు
హైదరాబాదులోని టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ నివాసం వద్ద జాయిస్ కమల (36) అనే మహిళ హంగామా సృష్టించింది. పవన్ కల్యాణ్ జూబ్లీహిల్స్ లో రోడ్ నెం.35లో నివాసం ఉంటున్నారు. 

ఆ మహిళ తాను పవన్ కల్యాణ్ ను కలవాలని సెక్యూరిటీ సిబ్బందికి చెప్పింది. అందుకు వారు అంగీకరించకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. తన దుస్తులు తీసేస్తూ, రాళ్లతో వారిపై దాడికి దిగింది. 

ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఆమెను స్టేషన్ కు తరలించారు. జాయిస్ కమల తమిళనాడుకు చెందిన మహిళ అని గుర్తించారు. 

మధురై ప్రాంతానికి జాయిస్ కమలకు మతిస్థిమితంలేదు. ఆమె గతంలో పవన్ మేనల్లుడు, హీరో సాయితేజ్ ఇంటి ఎదుట కూడా ఇలాగే హంగామా సృష్టించినట్టు తెలిసింది. అప్పట్లో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రానికి తరలించారు.
Pawan Kalyan
Woman
Residence
Hyderabad

More Telugu News