Corona Virus: భారత్ చేరుకున్న అంతర్జాతీయ ప్రయాణికుల్లో 11 కరోనా వేరియంట్ల గుర్తింపు

  • పలు ప్రపంచ దేశాల్లో మరోసారి కరోనా కలకలం
  • ఉనికిని చాటుకుంటున్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు
  • భారత్ ఎయిర్ పోర్టుల్లో కరోనా పరీక్షలు
  • శాంపిళ్లకు జీనోమ్ సీక్వెన్సింగ్
Eleven Omicron sub variants found in international travelers who came to India

ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్-7 వేగంగా వ్యాపించే సామర్థ్యం గలదన్న నేపథ్యంలో ఇటీవల భారత్ లో కరోనా శాంపిళ్లకు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహిస్తున్నారు. ఎయిర్ పోర్టుల్లో అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, భారత్ చేరుకున్న అంతర్జాతీయ ప్రయాణికుల్లో 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లను గుర్తించారు. డిసెంబరు 24 నుంచి జనవరి 3వ తేదీ మధ్యన విదేశాల నుంచి 9.05 లక్షల మంది భారత్ చేరుకోగా, వారిలో 19,227 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 124 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారిలో 40 మంది నుంచి సేకరించిన శాంపిల్స్ కు జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించడంతో ఈ 11 కొత్త వేరియంట్లు బయటపడ్డాయి. 

వాటిలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్లలో ఒకటైన ఎక్స్ బీబీ శ్రేణిలో వరుసగా ఎక్స్ బీబీ1, ఎక్స్ బీబీ2, 3, 4, 5 తోపాటు బీక్యూ1.1 శ్రేణిలో బీక్యూ1.122, బీక్యూ 1.1.5:9 తదితర వేరియంట్లు ఉన్నాయి.

More Telugu News