Narayana: టెన్త్ పరీక్ష పత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణకు ఊరట

  • గతేడాది తెలుగు పేపర్ లీక్
  • నారాయణ పాత్ర ఉందన్న పోలీసులు
  • మే నెలలో అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు
  • బెయిల్ పై బయటికొచ్చిన నారాయణ
  • బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
Supreme Court gives stay on high court orders cancelled bail to Narayana

గత సంవత్సరం పదో తరగతి పరీక్షల సందర్భంగా చిత్తూరు జిల్లా నెల్లేపల్లి జడ్పీ హైస్కూల్ లో ప్రశ్నాపత్రం లీకైంది. తెలుగు సబ్జెక్టు ప్రశ్నాపత్రం వాట్సాప్ ద్వారా బయటికి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇందులో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు నారాయణ పాత్ర ఉందని పేర్కొన్నారు. 

ఈ కేసుకు సంబంధించి గతేడాది మే నెలలో నారాయణను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనకు బెయిల్ లభించగా, ఇటీవల ఆ బెయిల్ ను హైకోర్టు రద్దు చేసింది. దాంతో నారాయణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 

ఈ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు... నారాయణ బెయిల్ రద్దు చేయాలన్న హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

More Telugu News