KCR: కేసీఆర్‌ కనుసన్నల్లో తెలంగాణలో కొత్త ప్రాంతీయ పార్టీ: బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్

New regional party in Telangana in KCR guidence says BJP leader NVSS
  • సంక్రాంతి తర్వాత ఏర్పాటు కాబోతోందంటూ సంచలన వ్యాఖ్యలు
  • కేసీఆర్, జగన్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందన్న బీజేపీ నేత 
  • ఇందులో భాగంగానే బీఆర్ఎస్ లో ఏపీ నేతలు చేరుతున్నారని ఆరోపణ 
బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కనుసన్నల్లో సంక్రాంతి తర్వాత తెలంగాణ పేరుతో కొత్త ప్రాంతీయ పార్టీ ఏర్పాటు కాబోతోందని ఆయన అన్నారు. పండుగ తర్వాత రాష్ట్రంలో సరికొత్త పరిణామాలు జరుగుతాయన్నారు. కేసీఆర్‌ అసలు రంగును బీజేపీ బట్టబయలు చేస్తుందని ప్రభాకర్ ప్రకటించారు. కేసీఆర్‌, జగన్‌ మధ్య రహస్య ఒప్పందంలో భాగమే బీఆర్‌ఎస్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేతలు చేరుతున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ లో ఖరీదైన వివాదాస్పద భూములను ఏపీ సీఎం జగన్‌ ఆత్మ బంధువులకు కట్టబెడుతున్నారని ప్రభాకర్ ఆరోపించారు.
KCR
Telangana
new
party
bjp
nvss prabhakar

More Telugu News