Earthquake: ఆఫ్ఘనిస్థాన్ లో భూకంపం... భారత్ లోనూ ప్రకంపనలు

  • హిందూకుష్ పర్వతశ్రేణిలో భూకంపం
  • ఫైజాబాద్ కు 79 కిమీ దూరంలో భూకంప కేంద్రం
  • రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రత నమోదు
  • భారత్, పాకిస్థాన్ లోనూ కంపించిన భూమి
Tremors happens in India after earthquake hits Afghanistan

ఆఫ్ఘనిస్థాన్ లోని హిందూకుష్ పర్వతశ్రేణిలో భూకంపం సంభవించింది. ఫైజాబాద్ కు దక్షిణంగా 79 కిలోమీటర్ల దూరంలో భూఉపరితలం నుంచి 200 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. 

దీని ప్రభావంతో భారత్, పాకిస్థాన్ దేశాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంతో పాటు హర్యానా, రాజస్థాన్, జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. రాత్రి 7.50 గంటల సమయంలో ఢిల్లీలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. 

దేశ రాజధాని ప్రాంతంలో జనవరి 1 వేకువజామున కూడా భూకంపం వచ్చినట్టు ఎన్సీఎస్ తెలిపింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైంది.

More Telugu News