Voters Lists: తెలుగు రాష్ట్రాల ఓటర్ల జాబితాలు విడుదల చేసిన ఎన్నికల సంఘం... వివరాలు ఇవిగో!

  • ఇటీవల పూర్తయిన ఓటర్ల జాబితా సవరణలు
  • ఏపీ, తెలంగాణ నూతన జాబితాలు ప్రకటించిన ఈసీ
  • ఏపీలో 4 కోట్లకు చేరువలో ఓటర్లు
  • తెలంగాణలో 3 కోట్లకు చేరువలో ఓటర్లు
Election Commission announces Telangana and AP voters lists

కేంద్ర ఎన్నికల సంఘం తెలుగు రాష్ట్రాల ఓటర్ల జాబితాలను విడుదల చేసింది. ఇటీవల ఓటర్ల సవరణ పూర్తయిన నేపథ్యంలో, తెలంగాణ, ఏపీలకు సంబంధించి నూతన జాబితాలు రూపొందించింది. తెలంగాణలో ఓటర్ల సంఖ్య 3 కోట్లకు చేరువ కాగా, ఏపీలో 4 కోట్లకు దగ్గరైంది. ప్రతి సంవత్సరం కేంద్ర ఎన్నికల సంఘం సవరణల అనంతరం జనవరిలో ఓటర్ల తుది జాబితాలను ప్రకటించడం ఆనవాయతీ.

తాజాగా ప్రకటించిన జాబితాల ప్రకారం...

  • తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య- 2,99,92,941
  • పురుష ఓటర్ల సంఖ్య- 1,50,48,250
  • మహిళా ఓటర్ల సంఖ్య- 1,49,24,718
  • థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య- 1,951
  • సర్వీసు ఓటర్ల సంఖ్య- 15,282
  • హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల సంఖ్య- 42,15,456
  • రంగారెడ్డి జిల్లాలో ఓటర్ల సంఖ్య- 31,08,068
  • మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఓటర్ల సంఖ్య- 25,24,951
  • అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం శేరిలింగంపల్లి (6,44,072)
  • అతి తక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్న నియోజకవర్గం భద్రాచలం (1,42,813)

  • ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఓటర్ల సంఖ్య- 3,99,84,868
  • ఏపీలో మహిళా ఓటర్ల సంఖ్య- 2,02,19,104
  • ఏపీలో పురుష ఓటర్ల సంఖ్య- 2,01,32,271
  • ఏపీలో సర్వీసు ఓటర్ల సంఖ్య- 68,162
  • థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య- 3,924
  • అత్యధిక ఓటర్లు ఉన్న జిల్లా కర్నూలు (19,42,233)
  • అతి తక్కువగా ఓటర్లు కలిగి వున్న జిల్లా (7,29,085)


More Telugu News