Cock Fights: సంక్రాంతికి కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు: పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ హెచ్చరిక

Police says severe punishments for Cock fights in Eluru and West Godavari Districts
  • కోడిపందాలకు పెట్టింది పేరైన గోదావరి జిల్లాలు
  • సమీపిస్తున్న సంక్రాంతి
  • బైండోవర్ కేసులు నమోదు చేశామన్న పశ్చిమ గోదావరి ఎస్పీ
  • ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి
సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు... ఏపీ కోస్తా జిల్లాల్లో కోడిపందాల జోరు మొదలవుతుంది. ముఖ్యంగా, ఉభయగోదావరి, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో నిర్వహించే కోడిపందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారతాయి! కోడిపందాలను ప్రభుత్వాలు ఎప్పుడూ అనుమతించకపోయినా, సంక్రాంతి పండుగ రోజుల్లో ఎక్కడో ఒక చోట పందాలు నిర్వహిస్తుంటారు.

ఈ నేపథ్యంలో, సంక్రాంతి సందర్భంగా ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోడిపందాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ పేర్కొన్నారు. 

కోడిపందాలకు వేదికలు సిద్ధంచేసేవారు, కోడిపందాలకు స్థలాలు ఇచ్చేవారు, కోడికత్తుల తయారీదారులు, పేకాట నిర్వహణదారులను గుర్తించామని, గత 15 రోజుల వ్యవధిలో 1,361 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని ఎస్పీ వివరించారు. పందాల పేరుతో జంతువులను, కోళ్లను హింసించడం నేరమని, ప్రజలు సహకరించాలని కోరారు.
Cock Fights
Police
Sankranti
Eluru
West Godavari District

More Telugu News