G.O.01: ఈ జీవో చంద్రబాబు కోసం తెచ్చింది కాదు: మంత్రి మేరుగు నాగార్జున

Minister Meruga Nagarjuna talks about  the govt order 01
  • ఏపీలో రోడ్లపై ర్యాలీలు, సభలు నిషేధం
  • జీవో నెం.01 తీసుకువచ్చిన వైసీపీ ప్రభుత్వం
  • కందుకూరు, గుంటూరు తరహా ఘటనలు జరగకూడదనే జీవో తెచ్చామన్న మంత్రి
  • ఈ జీవో వైసీపీకి కూడా వర్తిస్తుందని వెల్లడి
రాష్ట్రంలో రోడ్ షోలు, రోడ్లపై సభలు పెట్టడాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నెం.01ను తీసుకురావడంపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మంత్రి మేరుగు నాగార్జున స్పందించారు. 

కందుకూరు, గుంటూరు తరహా సంఘటనలు మళ్లీ జరగకూడదన్న ఉద్దేశంతోనే జీవో నెం.01 తీసుకువచ్చినట్టు వివరించారు. అంతేతప్ప, చంద్రబాబును అడ్డుకోవడం కోసమే ఈ జీవో తెచ్చామనడం తప్పు అని అన్నారు. ఈ జీవో వైసీపీ సహా అన్ని పార్టీలకు వర్తిస్తుందని తెలిపారు. ఈ జీవో తీసుకువచ్చాక సీఎం జగన్ రోడ్ షోలు చేయలేదని వెల్లడించారు. 

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ సిద్ధంగానే ఉందని, ప్రత్యర్థి రాజకీయ పక్షాలన్నీ జగన్ రథచక్రాల కింద నలిగిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఇక, టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్రను తాము అడ్డుకోబోమని మేరుగు నాగార్జున స్పష్టం చేశారు.
G.O.01
Merugu Nagarjuna
YSRCP
Jagan
Chandrababu
TDP

More Telugu News