Steve Smith: బ్రాడ్ మన్ రికార్డును అధిగమించిన స్టీవ్ స్మిత్

Steve Smith breaks Bradman record
  • దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో సెంచరీ చేసిన స్టీవ్ స్మిత్
  • శతకాలను 30కి పెంచుకున్న స్మిత్
  • 29 సెంచరీలను సాధించిన బ్రాడ్ మన్
దక్షిణాఫ్రికాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ మరో మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో స్టీవ్ స్మిత్ 104 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో తన శతకాల సంఖ్యను 30కి పెంచుకున్నాడు. దీంతో ప్రపంచ క్రికెట్ దిగ్గజం బ్రాడ్ మన్ ను స్మిత్ అధిగమించాడు. బ్రాడ్ మన్ తన కెరీర్ లో 29 సెంచరీలను సాధించాడు. ఆ రికార్డును స్టీవ్ స్మిత్ అధిగమించాడు. 

ఆస్ట్రేలియా తరపున అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన జాబితాలో రికీ పాంటింగ్ (41 సెంచరీలు) తొలి స్థానంలో ఉన్నాడు. 32 సెంచరీలతో స్వీవ్ వా, 30 శతకాలతో స్టీవ్ స్మిత్, మాథ్యూ హేడెన్ లు మూడో స్థానంలో ఉన్నారు. రిక్కీ పాంటింగ్ రికార్డును బద్దలుకొట్టే అవకాశం స్టీవ్ స్మిత్ కు ఉంది.
Steve Smith
Don Bradman
Australia

More Telugu News