YS Jagan: యలమంచిలిలో అడారి తులసీరావు భౌతికకాయానికి నివాళులు అర్పించిన సీఎం జగన్

CM Jagan paid homage to Adari Tulasirao mortal remains
  • విశాఖ డెయిరీ చైర్మన్ తులసీరావు నిన్న మృతి
  • నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం పర్యటన
  • తులసీరావు కుటుంబసభ్యులకు పరామర్శ 
విశాఖ డెయిరీ చైర్మన్ అడారి తులసీరావు (85) నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న తులసీరావు హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో, ఏపీ సీఎం జగన్ ఇవాళ అడారి తులసీరావు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. 

సీఎం జగన్ అనకాపల్లి జిల్లా యలమంచిలి వచ్చారు. తులసీరావు నివాసానికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం వెంట మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు. 

అడారి తులసీరావు గత 30 ఏళ్లుగా విశాఖ డెయిరీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన కుమార్తె రమాకుమారి యలమంచిలి మున్సిపల్ చైర్ పర్సన్ కాగా, కుమారుడు ఆనంద్ కుమార్ విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు.
YS Jagan
Adari Tulasirao
Homage
Yelamanchili
Anakapalli District
YSRCP
Andhra Pradesh

More Telugu News