Aathmika: అందం అంటే ఇదే .. 'ఆత్మిక' లేటెస్ట్ పిక్స్!

Aathmika Special
  • తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆత్మిక 
  • అందం .. ఆకర్షణీయమైన రూపం ఆమె సొంతం 
  • రిలీజ్ కి రెడీ అవుతున్న రెండు తమిళ సినిమాలు 
  • తెలుగులోను సరైన అవకాశం కోసం వెయిటింగ్
  • ఇక్కడ నిలదొక్కుకునే అవకాశాలైతే పుష్కలం   
కోలీవుడ్ భామలు చాలామంది ఇప్పుడు టాలీవుడ్ పై దృష్టి పెట్టారు. తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి వెళ్లడంతో, ఇక్కడ గుర్తింపు తెచ్చుకోవడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దిశగా ఎవరి స్థాయిలో వారు పావులు కదుపుతూనే ఉన్నారు. అలాంటి నాయికల జాబితాలో 'ఆత్మిక' కూడా కనిపిస్తోంది. తమిళనాడుకి చెందిన ఈ బ్యూటీ తమిళ సినిమాతో 2017లోనే ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత మూడేళ్లపాటు గ్యాప్ తీసుకున్న ఈ సుందరి, అప్పటి నుంచి మాత్రం చకచకా అవకాశాలను అందుకుంటూనే వెళుతోంది. విజయ్ ఆంటోని జోడీగా మెప్పించిన ఆత్మిక, త్వరలో ఉదయనిధి స్టాలిన్ జోడీగాను .. సందీప్ కిషన్ సరసన అలరించనుంది. ఇక టాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునే దిశగా ప్రయత్నాలు మొదలెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆత్మిక లేటెస్ట్ పిక్స్ ను వదిలారు. నీలిరంగు శారీలో ఈ బ్యూటీ తళుక్కున మెరుస్తోంది. చక్కని కనుముక్కుతీరుతో .. ఆకర్షణీయమైన రూపంతో ఆకట్టుకుంటోంది. ఇక్కడి యంగ్ హీరోల జోడీగా వరుస ఛాన్సులను కొట్టేసే లక్షణాలైతే పుష్కలంగానే కనిపిస్తున్నాయి మరి.
Aathmika
Actress
Kollywood

More Telugu News