jagapathi babu: పేద విద్యార్థినికి అండగా నిలిచిన జగపతిబాబు

Jagapathi Babu help to student
  • డిగ్రీ చదువుతూ సామాజిక సమస్యలపై పోరాడుతున్న జయలక్ష్మి
  • తల్లిదండ్రులు చెత్తను సేకరించే కార్మికులు
  • ఆమె సివిల్స్ కోచింగ్ కు ఆర్థిక సాయం చేస్తానన్న జగపతిబాబు
ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు పెద్ద మనసును చాటుకున్నారు. ఒక పేద విద్యార్థిని చదువుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని భరించేందుకు ముందుకు వచ్చారు. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్, సైదాబాద్ కు చెందిన జయలక్ష్మి డిగ్రీ చదువుతూనే సామాజిక సమస్యలపై పోరాడుతోంది. ఈమె తల్లిదండ్రులు ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించే పారిశుద్ధ్య కార్మికులు. 

తాను చేస్తున్న కార్యక్రమాలకు గాను జయలక్ష్మి గతంలో బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ నుంచి 'డే ఆఫ్ ది గర్ల్ ఛాలెంజ్' రన్నరప్ పురస్కారాన్ని అందుకున్నారు. ఛేంజ్ మేకర్ అవార్డులను కూడా అందుకున్నారు. మరోవైపు సివిల్స్ ను సాధించడమే లక్ష్యంగా ఆమె కష్టపడుతున్నారు. ఆమె సాధించిన విజయాల గురించి ఓ టీవీ ఛానల్ లో కథనం ప్రసారమయింది. ఈ కథనాన్ని చూసిన జగపతిబాబు తల్లి ఆ అమ్మాయికి ఏదైనా సాయం చేయాలని చెప్పారు. దీంతో జయలక్ష్మిని జగపతిబాబు పిలిచి మాట్లాడారు. సివిల్స్ శిక్షణకు అవసరమైన ఆర్థిక సాయం చేస్తానని ఆమెకు జగపతిబాబు హామీ ఇచ్చారు.
jagapathi babu
Tollywood
Student
Help

More Telugu News