Chandrababu: చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు.. హైటెన్షన్

High tension in Chandrababu Kuppam programme
  • చంద్రబాబు కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత
  • ర్యాలీకి, సభకు అనుమతి లేదన్న పోలీసులు
  • పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం
కుప్పం నియోజకర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తన సొంత నియోజకవర్గ పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి, సభకు అనుమతి లేదని పోలీసులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. తన నియోజకవర్గంలో తాను పర్యటించేందుకు ఎవరి అనుమతి కావాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు చంద్రబాబు అక్కడకు చేరుకోవడానికి ముందే పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నాయి. ఈ క్రమంలో వారిపై పోలీసులు లాఠీఛార్జీ కూడా చేశారు. దీంతో పలువురు గాయపడ్డారు. కొందరు మహిళలు స్పృహతప్పి పడిపోయారు. పోలీసులతో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. కుప్పం గడ్డ.. చంద్రబాబు అడ్డా అంటూ నినాదాలు చేశారు.
Chandrababu
Telugudesam
kuppam

More Telugu News