Vasantha Krishna Prasad: ఉయ్యూరు శ్రీనివాస్ పేదల పట్ల అభిమానం ఉన్న వ్యక్తి : వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ 

YCP MLA Vasantha Krishna Prasad comments about Uyyuru Srinivas
  • ఇటీవల గుంటూరులో ఉయ్యూరు శ్రీనివాస్ కార్యక్రమం
  • చంద్రన్న కానుకల పంపిణీ
  • తొక్కిసలాటలో ముగ్గురి మృతి
  • ఉయ్యూరు శ్రీనివాస్ అరెస్ట్.. విడుదల  
  • శ్రీనివాస్ తనకు మంచి మిత్రుడన్న వైసీపీ ఎమ్మెల్యే
ఇటీవల జరిగిన గుంటూరు తొక్కిసలాట ఘటన నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. గుంటూరు ఘటనను చిలవలు పలవులు చేసి మాట్లాడడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఉయ్యూరు శ్రీనివాస్ తనకు మంచి మిత్రుడు అని వసంత కృష్ణప్రసాద్ వెల్లడించారు. 

ప్రవాసాంధ్రుల వల్ల దేశానికి మంచి జరుగుతుందని అన్నారు. శ్రీనివాస్ పేదల పట్ల అభిమానం ఉన్న వ్యక్తి అని తెలిపారు. ప్రజలకు నష్టం కలిగించాలని ఉయ్యూరు శ్రీనివాస్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని తాను అనుకోవడంలేదని వసంత కృష్ణప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీతో కలిసి కార్యక్రమం చేశారు కాబట్టే శ్రీనివాస్ పై వివాదాలు వచ్చాయని వ్యాఖ్యానించారు.
Vasantha Krishna Prasad
Uyyuru Srinivas
YSRCP
TDP
Guntur

More Telugu News