హైదరాబాదులో చలపతిరావు సంస్మరణ సభ... నివాళులు అర్పించిన బాలకృష్ణ

  • డిసెంబరు 24న చలపతిరావు కన్నుమూత
  • కడసారి వీడ్కోలుకు రాలేకపోయిన బాలకృష్ణ
  • వీరసింహారెడ్డి చిత్రీకరణలో ఉన్న వైనం
  • నేడు చలపతిరావు కుమారుడు రవిబాబుకు పరామర్శ
Balakrishna paid homage to Cahalapathirao

ఇటీవల కన్నుమూసిన టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు సంస్మరణ సభ ఇవాళ హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. తనకెంతో సన్నిహితుడైన చలపతిరావు భౌతికకాయాన్ని చూసేందుకు రాలేకపోయినందుకు విచారం వ్యక్తం చేసిన బాలకృష్ణ... ఇవాళ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చలపతిరావు కుమారుడు రవిబాబును పరామర్శించారు. 

గత నెల 24న చలపతిరావు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో బాలయ్య వీరసింహారెడ్డి చిత్రీకరణలో ఉన్నారు. దాంతో ఆయన చలపతిరావుకు కడసారి వీడ్కోలు పలికేందుకు రాలేకపోవడం పట్ల చాలా బాధపడ్డారు. 

నటుడు చలపతిరావుకు ఎన్టీఆర్ కు మధ్య ఆత్మీయ అనుబంధం ఉండేది. చలపతిరావు ఆ అనురాగాన్నే బాలకృష్ణపైనా చూపించేవారు. బాలయ్యతో కలిసి చలపతిరావు అనేక చిత్రాల్లో నటించారు.

More Telugu News