Varahi: త్వరలో కొండగట్టు ఆలయానికి పవన్ 'వారాహి' వాహనం

Special Pooja to Pawan Kalyan Varahi vehicle at Kondagattu
  • త్వరలో పవన్ రాష్ట్ర యాత్ర
  • ప్రత్యేకంగా వారాహి పేరిట వాహనం తయారు చేయించుకున్న వైనం
  • ఇటీవలే రిజిస్ట్రేషన్ పనుల పూర్తి
  • కొండగట్టు క్షేత్రంలో వాహనానికి పూజలు చేయించనున్న పవన్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్త యాత్ర కోసం ప్రత్యేకంగా వారాహి పేరిట ఓ వాహనాన్ని తయారుచేయించుకోవడం తెలిసిందే. ఇటీవల ఈ వాహనం రిజిస్ట్రేషన్ పనులు పూర్తయ్యాయి. ఈ వాహనం రంగుపై వైసీపీ నేతల నుంచి వ్యాఖ్యలు రావడం, అందుకు జనసేన నేతలు దీటుగా బదులివ్వడం కూడా జరిగాయి. 

ఈ నేపథ్యంలో, వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. త్వరలోనే జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వారాహి వాహనాన్ని తీసుకెళ్లనున్నట్టు జనసేన నేతలు వెల్లడించారు. అక్కడ వారాహికి పూజలు చేయించనున్నట్టు తెలిపారు. అయితే, తేదీ ఇంకా ఖరారు కాలేదని నేతలు వివరించారు. 

కొండగట్టులో పూజలు చేయించిన తర్వాతే వారాహి వాహనాన్ని విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి తీసుకెళతామని వారు వెల్లడించారు.
Varahi
Kondagattu
Pawan Kalyan

More Telugu News