TDP: పది రోజులు ఆల‌స్యమైనా కూడా జీతాలు ఇవ్వ‌లేని మీకు ఏం కోత వేయాలో సెల‌వివ్వండి సారూ: నారా లోకేశ్​

Nara lokesh questins cm jagan over salary delay for govt emplyees
  • ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ హాజరు
  • విధులకు ఆలస్యం అయితే జీతాల్లో కోత పెడతామని హెచ్చరిక
  • ఉద్యోగులకు జీతాలు ఆలస్యంగా చెల్లించడంపై నారా లోకేశ్ విమర్శ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఏపీ ప్రభుత్వం బయో మెట్రిక్ హాజరు ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. విధులకు ఆలస్యం కాకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ హాజరును ప్రభుత్వం ఈ మధ్యే అమల్లోకి తెచ్చింది. అయితే, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆలస్యంగా వస్తే జీతంలో కోత పెడతామని ప్రభుత్వం హెచ్చరిస్తోందని లోకేశ్ అన్నారు. 

కానీ, వాళ్లకు జీతాలు సరైన సమయానికి చెల్లించకపోవడంపై టీడీపీ నేత ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘విధుల‌కు ప‌ది నిమిషాలు ఆల‌స్య‌మైతే ప్ర‌భుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల‌కు జీతం కోత వేస్తాన‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేసిన ముఖ్య‌మంత్రి గారూ! ప‌ది రోజులు ఆల‌స్యమైనా కూడా జీతాలు ఇవ్వ‌లేని మీకు ఏం కోత వేయాలో సెల‌వివ్వండి సారూ!’ అని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News