'మంజునాథ్'గా డిఫరెంట్ లుక్ తో కల్యాణ్ రామ్!

  • 'కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన 'అమిగోస్'
  • డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న కల్యాణ్ రామ్ 
  • కథానాయికగా ఆషిక రంగనాథ్ పరిచయం 
  • త్వరలోనే టీజర్ రిలీజ్ 
  • ఫిబ్రవరి 10వ తేదీన సినిమా విడుదల  
Kalyanram New Poster Released

కల్యాణ్ రామ్ 'బింబిసార' హిట్ తరువాత మంచి ఊపు మీద ఉన్నాడు. 'బింబిసార' సీక్వెల్ కి ముందు ఆయన రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటిగా 'అమిగోస్' రూపొందింది. మైత్రీ వారు నిర్మించిన ఈ సినిమాకి రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించాడు. 

ఈ సినిమాలో మంజునాథ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కల్యాణ్ రామ్ కనిపించనున్నట్టు చెబుతూ అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. కల్యాణ్ రామ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చాలా సాఫ్ట్ లుక్ తో .. చాలా పద్ధతిగా పోస్టర్లో కనిపిస్తున్నాడు. 

ఈ సినిమాలో ఆయన జోడీగా ఆషిక రంగనాథ్ కనిపించనుంది. తెలుగులో ఆమెకి ఇదే ఫస్టు మూవీ. గిబ్రాన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. త్వరలో టీజర్ ను వదలడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News