Raghu Rama Krishna Raju: ర్యాలీలు రోడ్లపైన కాకుండా గాల్లో చేసుకుంటారా?: రఘురామకృష్ణరాజు

 Are the rallies held in the air instead of on the roads asks Raghu Rama Krishna Raju
  • కుటుంబమంతా ఐదేళ్లు రోడ్లపై ర్యాలీలు, సభలు పెట్టారన్న రఘురాజు
  • అధికారంలోకి వచ్చిన తర్వాత ర్యాలీలు వద్దంటారా? అని మండిపాటు
  • సభలకు బందోబస్తు ఇవ్వడం చేతకాదని అనుకోవాలా? అని ప్రశ్న
రోడ్లపై ర్యాలీలు, సభలను నిర్వహించకుండా ఏపీ ప్రభుత్వం నిషేధం విధించడంపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల పాటు జగన్ కుటుంబమంతా రోడ్లపై ర్యాలీలు, సభలు పెట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లపై ర్యాలీలు వద్దంటారా? అని ప్రశ్నించారు. ర్యాలీలను రోడ్లపై కాకుండా గాల్లో చేస్తారా? అని ఎద్దేవా చేశారు. రాజకీయ పార్టీల ర్యాలీలు, సభలకు బందోబస్తు ఇవ్వడం మీకు చేతకాదని అర్థం చేసుకోవాలా? అని ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావని అన్నారు.
Raghu Rama Krishna Raju
YSRCP
Jagan
Rallies

More Telugu News