Sundeep Kishan: 'మైఖేల్' రిలీజ్ డేట్ ఖరారు!

  • 'మైఖేల్'గా సందీవ్ కిషన్ 
  • కీలకమైన పాత్రలో విజయ్ సేతుపతి 
  • రంజిత్ జయకొడి దర్శకత్వం వహించిన సినిమా ఇది 
  • ఫిబ్రవరి 3వ తేదీన విడుదల   
Michael Movie Release Date Confirmed

సందీవ్ కిషన్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. యాక్షన్ .. కామెడీ టచ్ ఉన్న పాత్రలను తను చాలా బాగా చేస్తాడనే పేరుంది. అందువలన ఆ తరహా కథలనే ఆయన ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటాడు. ఆయన తాజా చిత్రంగా 'మైఖేల్' రూపొందింది. నారాయణదాస్ నారంగ్ నిర్మించిన ఈ సినిమాకి, రంజిత్ జయకొడి దర్శకత్వం వహించాడు.

తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. వచ్చేనెల 3వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, కొంతసేపటి క్రితం అధికారిక పోస్టర్ ను వదిలారు. సిక్స్ ప్యాక్ తో సందీప్ కిషన్ కనిపించనున్న ఈ సినిమాలో, కథానాయికగా దివ్యాన్ష కౌశిక్ అలరించనుంది.

సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, విజయ్ సేతుపతి .. వరలక్ష్మి శరత్ కుమార్ .. గౌతమ్ మీనన్ .. అనసూయ .. వరుణ్ సందేశ్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. తెలుగు .. తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా, ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది చూడాలి..

More Telugu News