Bomb: పంజాబ్ సీఎం నివాసం వద్ద బాంబు గుర్తింపు

  • చండీగఢ్ లో సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలో బాంబు
  • బాంబును గుర్తించిన బోరుబావి యంత్రం ఆపరేటర్
  • బాంబును స్వాధీనం చేసుకున్న బాంబు స్క్వాడ్
Bomb found near Punjab CM residence

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాసం వద్ద బాంబు కలకలం రేగింది. చండీగఢ్ లో సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలో హెలిప్యాడ్ వద్ద బాంబును గుర్తించారు. వెంటనే బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ కు సమాచారం అందించారు. హుటాహుటీన సీఎం నివాసం వద్దకు చేరుకున్న బాంబు స్క్వాడ్ ఆ బాంబును స్వాధీనం చేసుకుంది. భారత సైన్యం పశ్చిమ కమాండ్ అధికారులు కూడా ఈ ఘటనపై దృష్టి సారించారు. 

ఈ సాయంత్రం ఓ బోరుబావి యంత్రం ఆపరేటర్ ఈ బాంబును గుర్తించి సమాచారం అందించడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తన నివాసంలో లేరు. ఆ బాంబు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై దర్యాప్తులో తేలుతుందని అధికారులు వెల్లడించారు.

More Telugu News