Devineni Uma: గుంటూరు ఘటన వెనుక వైసీపీ హస్తం ఉంది: దేవినేని ఉమ

Devineni Uma alleges YCP hand behind Guntur incident
  • గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీ
  • తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళల మృతి
  • పోలీసుల అనుమతితోనే కార్యక్రమం చేపట్టారన్న ఉమ
  • మహిళల మృతి ఘటన బాధాకరమని వెల్లడి
గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వహించిన చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందడం తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. గుంటూరు ఘటనలో ముగ్గురు చనిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. 

పోలీసుల అనుమతితోనే ఈ కార్యక్రమం చేపట్టారని వెల్లడించారు. ఈ ఘటన వెనుక వైసీపీ హస్తం ఉందని ఆరోపించారు. అసలు రాజకీయం జనవరి నుంచి చూస్తారని నవంబరు 20న జగనన్న సైన్యం సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టిందని, నిన్నటి ఘటనకు ఆ పోస్టుకు సంబంధం ఉందని దేవినేని ఉమ ఆరోపించారు.
Devineni Uma
Guntur Incident
YCP
TDP

More Telugu News