Kundabaddalu Subbarao: రాజకీయ విశ్లేషకుడు 'కుండబద్దలు' సుబ్బారావు మృతి

  • కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న సుబ్బారావు
  • గుంటూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స
  • ఆరోగ్యం క్షీణించడంతో నేడు కన్నుమూత
  • సంతాపం తెలిపిన ప్రముఖులు, పాత్రికేయ సంఘాల నేతలు
Kundabaddalu Subbarao dies of severe illness

'కుండబద్దలు' యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు, రాజకీయ విశ్లేషకుడు కాటా సుబ్బారావు మరణించారు. గుంటూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తన యూట్యూబ్ వీడియోలతో కుండబద్దలు సుబ్బారావుగా ప్రసిద్ధికెక్కిన ఆయన కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కిడ్నీ వ్యాధి కారణంగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఆయనను నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పరామర్శించారు. కుండబద్దలు సుబ్బారావు మృతి పట్ల ప్రముఖులు, పాత్రికేయ సంఘాల నేతలు సంతాపం తెలియజేశారు. 

సీఎం జగన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ ఇటీవల ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేయడం తెలిసిందే. కుండబద్దలు సుబ్బారావు మృతితో ఆయన స్వస్థలం పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

More Telugu News