Tollywood: రీ రిలీజ్ లోనూ రికార్డు బద్దలు కొట్టిన పవన్ కల్యాణ్ ‘ఖుషి’

Pawan Kalyan Khushi broke the record in the re release as well
  • న్యూ ఇయర్ కానుకగా తిరిగి విడుదల 
  • ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజే రూ. 4.15 కోట్ల వసూలు
  • రీరిలీజ్ లో తొలి రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా ఘనత
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కున్న ఫ్యాన్ బేస్, స్టార్ డమ్ అందరికీ తెలిసిందే. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ కు పండగే. చిత్రం ఎలా ఉన్నా కూడా ఓపెనింగ్ కలెక్షన్స్ మాత్రం అదిరిపోతుంటాయి. ఈ మధ్య ఆయన చిత్రాలు విడుదలతోనే కాదు.. రీ రిలీజ్ లతోనూ రికార్డులు కొల్లగొడుతున్నాయి. ఈ మధ్య టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. గతేడాది పవన్ పుట్టిన రోజు సందర్భంగా ‘జల్సా’ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయగా... తాజాగా న్యూయర్ సందర్భంగా పవన్ ‘ఖుషి’ సినిమా రీ రిలీజ్ చేశారు. 

ఈ సినిమా వచ్చి దాదాపు 22 ఏళ్లవుతోంది. అయినా సరే దీని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. కొత్త సినిమాకు వచ్చినట్లు ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడ్డారు. దీంతో రీ రిలీజ్ కలెక్షన్స్ రికార్డులు బ్రేక్ అయ్యాయి. విడుదల చేసిన ప్రతిచోటా సినిమాకు నీరాజనం పలికారు. దీంతో తొలిరోజు.. ప్రపంచ వ్యాప్తంగా  రూ.4.15 కోట్లు వచ్చాయి. వీటిలో తెలుగు రాష్ట్రాల్లోనే రూ.3.62 కోట్ల వసూళ్లు దక్కాయి. రీరిలీజ్ అయిన చిత్రాల్లో తొలి రోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘ఖుషి’ రికార్డు సాధించింది. ఇప్పటివరకు రూ. 3.20 కోట్లతో అగ్రస్థానంలో ఉన్న తన ‘జల్సా’ రికార్డునే పవన్ బ్రేక్ చేశాడు. మహేశ్ బాబు ‘పోకిరి’ చిత్రం రీరిలీజ్ లో రూ. 1.52 కోట్లతో మూడో స్థానంలో ఉన్నట్టు ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Tollywood
Pawan Kalyan
khushi
re release
record

More Telugu News